Sunday, September 18, 2016

Vileenamenata! Gidem muchchata Kavithakka?

నా చిన్నప్పటిసంది ఈ అనుమానముండే !

నైజము నిరంకుశత్వం నుండి రాజాకారుల కోరాలనుండి మన ఆడ బిడ్డేలను కాపాడి హైదరాబాదుకు విమోచనం ఇచ్చిన సర్దారు పటేల్ కన్నా, మమ్లను  కాపాడాల వద్దా అని శోచాయించిన పండిట్ నెహ్రూనే కొంగ్రెసు పార్టీ గొప్పోనిగా తెలంగాణలో డప్పు కొట్టే!

గిదెందిరబై అని అడిగితే గదంతే ర బై అంటుండే! నాకిప్పుడు డెబ్బై ఏండ్లు. ఈనాటికీ ఈ సందేహానికి జవాబ్ సెప్పెటోడు లేకపయే!

నేను నా భార్య పల్లెటూరిలనే ఉంటం. బిడ్డలందరు పట్నంలో ఉంటరు. పాండగకి వస్తరు, పోతరు.  గదె, హైదరాబాదు పట్నం. గాడనే మా మన్మలు ఉద్యోగాల్జేస్తుర్రు. సాఫ్ట్వేరంట! గదె, బల్ల ముందు కూకొని కొంపుటర్ డబ్బాలో ఏమో జేస్తరంట. గదేన్దో నాకు తెల్వదిలే. కానీ ఒక్కటి మాత్రం తెల్సు. ఆ పట్నం ఎప్పుడెప్పుడు ఎవని వల్ల బాగుపడ్డదో  తెల్సు. నాకు అన్నీ యెర్కనే.

నేను పెద్దగా సదువుకోలే. కానీ ప్రతిరోజు తెలుగు పేపర్ సదువుతా! నేనంటే పల్లెటూరోడిని!
నా మన్మలైనా జర సెప్తరేమో అని ఈ విషయం అడిగిన!  "అరె ఏం తాత! ఈ వయసులో నీకిది అవసరమా! ఎవ్వదోచ్చిండు, ఎవ్వడు పోయిండు. ఎవ్వడేమీ సెసిండు.   గివ్వన్ని ఆలోచించడానికే మేము పుట్టినమ!" ఆనిండ్రు!

ఆళ్ళకి నిన్నమొన్నటి విషయమే గుర్తులే! అమ్మ అయ్యా ఊరు దోస్తులు... గివేమ్ అవసరం లే!
కనీసం "నీకు చదువు చెప్పిన మాస్టరు, నీకోసం పంజేసి కూడు పెట్టే ఉద్యోగం తెచ్చిన నాయకుడు అవసరం లే! " అని వదిలేసిన!

గదెందిర అంటే "నీకు మతిమరుపేమో తాత ! రజాకార్లు లేరు, బుజకార్లు లేరు. రజ్వీ యెవడు, నైజమూకీ ఆనికి లింకేంది! నీకు డిమాగ్ సక్కగైతే ఉందా లేదా! తెలంగాణ ఉద్యమం అనేది ఆంధ్రోల్ల మీదనే? మజ్లిసేంది మధ్యలో మజ్లిస్! దానికి తెలంగాణ ఉద్యమానికి లింకేందే! సద్రార్ పటెల్ అంటే పటేల్! నెహ్రూ అంటే పండిట్! గాన్తే! మంచిగా తినేసి కూకో! గిస్వంటి సవాల్ చెయ్యక! మంలను పారేశాని జెయ్యక!"

సొంచయించితే అర్థమయ్యిందెన్దంటే, నేను సదువుకోకున్న దిమాకుందని, ఈళ్ళకి సదువున్న దిమాక్ మాత్రం లేదని.

చరిత్రలో కసిమ్ రజ్వీ ఎవడో కూడా తెలీని తెలంగానోడు ఉంటాడా అనుకున్న హైదరాబాదు విమోచిన జరిగినప్పుడు! పదులా వందల! ఎందరో తెలంగాణ ఆడబిడ్డేలను ఎత్కపోయి చెరచిన రజాకార్లకు నాయకుడు కసిమ్ రజ్వీ. తెలంగాణ రైతుల భూములను ఆస్తులను లూటీ చేస్తూ, బిడ్డలను సంపుతూ,  లూటీలు చేస్తూ కొని నెలలు నెలలు ఆగమ్ ఆగమ్ జేసిండు ఈడు!
ఎందరో తలంగాణ విడిచిపెట్టి పోయిండ్రు. ఇంకెందరో చితికిపోయి నాసనమైండ్రు!

ఇంతటి నరమేథమ్నుండి తెలంగాణాను రక్షించిన దేవుడు పటేల్ను ఎన్నడో మరచినమ్.

ఇప్పుడు కొత్త కొత్త పిల్ల కాకులొచ్చి మాకే నేర్పించే కూతలు కూస్తుండ్రు! ఏం జెప్పాలే!
పైత్యం యాడికొచ్చిందంటే, రజాకార్ల వారసులకే వత్తాసు పేలుకుతుండ్రు ఈ పిల్ల కాకులు!

గిట్ల బొంకడానికి గల కారణమెంది అంటే... మళ్ళీ అదే సమాధానం! కాంగ్రెస్సు పార్టీకున్న జబ్బే ఈ పిల్లకాకులకు కూడా సోకింది! "డబ్బు, అధికారం" అనుకునేరు! అది పుట్టుకతో వచ్చేదే!

"దేశం పట్ల హేలనా భావం." ఇది మధ్యలో వచ్చే జబ్బు!

నేనేమంటనంటే! ఏమి తెల్వని ఎర్రిబాగులోల్లు నా మన్మలు. ఆళ్ళకి బొంకితే ఆల్లు నమ్ముతరేమో గాని,  నా ముందు పేలితే యెట్లా!

పిల్ల కాకులకు గాలివాన గురించి తెల్వదని అంటున్న!
దాన్ని ఎదుర్కొన్నప్పుడు మర్చిపోడానికి బ్రతికుంటే సంతోషం. ఒకవేళ బ్రతికుంటే మతిమరపు ఉండదు కాదు కదా, అది గుర్హ్తోచ్చినప్పుడల్లా గూటిలోనే కూకుంటారు!

గాలివాన వస్తది!
మీకు మంచి జ్ఞాపకాలను మిగుల్స్తది.

తల్లిని తూలనాడే పిల్లకాకులకు ఇది ఒక జాగృతి పరచే మాట!
పెద్దల మాట!

మేలుకో తెలంగాణ!


No comments:

Post a Comment